Heart Stroke |
పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని చాలామంది భావిస్తుంటారు. ఇక పెళ్లై 25 ఏండ్లు గడిచిందంటే.. ఆ దంపతులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తుంటారు. బంధువులను పిలిచి.. మళ్లీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ వేడుకలు కూడా గొప్ప అనుభూతిని ఇవ్వడమే కాకుండా.. ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కానీ ఈ దంపతులకు మాత్రం విషాదాన్ని మిగిల్చాయి. 25 ఏండ్ల మ్యారేజ్ డే సందర్భంగా.. ఓ భర్త తన భార్యతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. గుండెపోటుకు గురై ఆయన ప్రాణాలొదిలాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వసీం, ఫర్హాకు పెళ్లై 25 ఏండ్లు గడిచాయి. దీంతో వసీం, ఫర్హా దంపతులు సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు. ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ వేడుకలను నిర్వహించి కుటుంబ సభ్యులతో పాటు బంధువులను, స్నేహితులను ఆహ్వానించారు. ఇక సరదాగా వసీం దంపతులు స్టేజీపై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అంతలోనే భర్త వసీం.. వేదికపైనే కుప్పకూలిపోయాడు. షాక్‌కు గురైన భార్య ఫర్హా భర్త వద్దకు పరుగెత్తింది. అక్కడున్న వారంతా వసీంను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక వసీం చనిపోవడంతో భార్య గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వసీం వృత్తిరీత్యా షూ మర్చెంట్.
In Bareilly district #UttarPradesh during the 25th wedding anniversary celebration Trader Wasim Dancing while holding his wife’s hand. Suddenly he collapsed on the stage #viralvideo pic.twitter.com/fLYnZHFQW3
— srk (@srk9484) April 4, 2025