విధాత : మహారాష్ట్ర గడ్చిరోలిలోని చట్‌గావ్‌లో మరో పెద్ద పులి చనిపోయింది. చనిపోయిన పులికి పాదాలు, తల భాగాలు తొలగించి ఉండటంతో వేటగాళ్లు పులి గోర్లు, తల కోసం పెద్దపులిని హత్య చేసినట్లుగా ఫారెస్టు అధికారులు అనుమానిస్తున్నారు.
తాజాగా చంపబడిన పులితో కలిపి మహారాష్ట్రలో గత 10 నెలల్లో 40పెద్ద పులులు మృత్యు వాత పడ్డాయి. పెద్ద పులుల మరణాల పట్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ అడవులలో ప్రత్యేకంగా సంరక్షించబడుతున్న పులులు కూడ మరణిస్తున్న తీరు అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా తయారైం