Site icon vidhaatha

Viral Video | వ‌డ‌దెబ్బ‌కు వాన‌రం విల‌విల‌.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసు.. వీడియో

Viral Video | ల‌క్నో : దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మూగ జీవాలు కూడా విల‌విల‌లాడిపోతున్నాయి. ఓ కోతి వ‌డ‌దెబ్బ‌కు గురై విల‌విల‌లాడిపోయింది. స్పృహ త‌ప్పి ప‌డిపోయింది. దీంతో ఆ వాన‌రానికి ఓ పోలీసు ఆఫీస‌ర్ సీపీఆర్ చేసి దాని ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షార్‌లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోదు అవుతున్నాయి. అయితే మే 24వ తేదీన చెట్టు కింద ఉన్న ఓ కోతి ఉన్న‌ట్టుండి స్పృహ కోల్పోయింది. అక్క‌డే ఉన్న ఓ పోలీసు ఆఫీస‌ర్.. కోతిని గ‌మ‌నించాడు. వెంట‌నే దానికి సీపీఆర్ చేశాడు. దీంతో అది స్పృహలోకి వ‌చ్చింది. అనంత‌రం ఆ కోతికి కూల్ వాట‌ర్ శ‌రీరం మీద పోయ‌డంతో అది కాస్త ఊపిరి పీల్చుకుంది. త‌ర్వాత కోతి అటు నుంచి వెళ్లిపోయింది. అయితే వడ‌దెబ్బ‌కు గురైన కోతిని చూసి మిగ‌తా కోతులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాయి.

Exit mobile version