విధాత : టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు..మెదడులో సృజనాత్మకత ఉన్న వారు ఎవరైనా..కొత్త ఆవిష్కరణలకు సారధులవుతారు. ఇందుకు నిదర్శనంగా నిలిచాడు ఓ ఇంటర్ విద్యార్థి. పిట్ట కొంచం కూత ఘనమన్నట్లుగా..చదువుతుంది ఇంటర్ విద్య అయినా..కొమ్ములు తిరిగిన శాస్త్రవేత్తల మాదిరిగా ఏకంగా ఇంట్లోనే ఏఐ రోబోను సృష్టించి సంచలనం రేపాడు. అదికూడా కేవలం రూ.25 వేల ఖర్చుతోనే కావడం విశేషం. ఈ చౌకైన, అత్యాధునిక ఆవిష్కరణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే యూపీలోని బులంద్ షహార్ కి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆదిత్య ఇంట్లోనే కేవలం రూ.25 వేల ఖర్చుతో ఏఐ లేడీ టీచర్ ‘సోఫీ’ని తయారు చేశాడు. ఇందులో ఎల్ఎల్ఎం(LLM) చిప్‌సెట్ అమర్చాడు. ఇది మానవ మెదడు లాగే స్పందించి..విద్యార్థుల ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇవ్వగలదని ఆదిత్య వివరించాడు. తరగతి గదిలో చీర ధరించి నిజమైన టీచర్ మాదిరిగానే ఏఐ రోబో టీచర్ సోఫీ సంభాషిస్తున్న వీడియో వైరల్ గా మారింది. కేవలం 25వేల రూపాయలతో ఏకంగా ఓ ఏఐ రోబోని సృష్టించిన ఆదిత్య టాలెంట్ కు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. భవిష్యత్తులో ఆదిత్య తన రోబోను 3డీ మోడల్ గా అభివృద్ది చేస్తానని తెలిపాడు. అదిత్య ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలో ఐరిస్ అనే ఏఐ రోబో టీచర్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. తిరువనంతపురంలోని కేటీసీటీ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఐరిస్ రోబోను గత నెలలో ఇంట్రడ్యూస్ చేశారు. లేడీ టీచర్ మాదిరిగా క్లాసులో మాట్లాడుతున్న ఐరిస్ రోబో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల సందేహాలకు సమాధానలిస్తుంది. తాజాగా ఆదిత్య అంతకుమించి ఏఐరోబోను ఆవిష్కరించడం గమనార్హం.
बुलंदशहर : 17 साल के आदित्य ने बनाया AI टीचर रोबोट
➡घर पर बैठकर ही AI टीचर रोबोट तैयार किया
➡25 हजार रुपये की लागत में AI टीचर रोबोट
➡इस खास रोबोट का नाम ‘सोफी’ रखा गया है
➡एक महिला टीचर की तरह दिखता है रोबोट
➡AI टीचर रोबोट में लगा LLM चिपसेट
➡इंसानी दिमाग की तरह… pic.twitter.com/Uf3Un5UdeG— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 27, 2025
ఇవి కూడా చదవండి :
TPCC Mahesh Goud | బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పర్యటనలో అపరిచితుడి కలకలం!
