Naveen Patnaik | పాండ్యన్‌ నా వారసుడు కాదు : ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

Naveen Patnaik | కార్తికేయ పాండ్యన్‌ తన రాజకీయ వారసుడు కాదని, మరో అయిదేళ్లు రాష్ట్రాన్ని తానే పాలిస్తానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు. తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి రుగ్మతలు లేవని, గడిచిన నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. ఢిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నాయకులు తన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, పదేళ్లుగా ఇది వింటున్నానని తెలిపారు.

  • Publish Date - May 31, 2024 / 10:43 AM IST

Naveen Patnaik : కార్తికేయ పాండ్యన్‌ తన రాజకీయ వారసుడు కాదని, మరో అయిదేళ్లు రాష్ట్రాన్ని తానే పాలిస్తానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు. తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి రుగ్మతలు లేవని, గడిచిన నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. ఢిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నాయకులు తన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, పదేళ్లుగా ఇది వింటున్నానని తెలిపారు.

నవీన్‌ తన గురువని పాండ్యన్‌ చెబుతున్నారని, మీ విజయాల్లో ఆయన పాత్ర ఉందా..? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. పాండ్యన్‌ తన సక్సెస్‌లో సూత్రధారి కాదని, ప్రజలు తన విజయానికి కారణమని చెప్పారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో పాండ్యన్‌ సారథ్యంపై సమాధానం దాటేసిన పట్నాయక్‌.. ఆయన ఉన్నత వ్యక్తిత్వం తనకు నచ్చిందని చెప్పారు. పాండ్యన్‌ దగ్గరైనంతగా ఇతర బీజేడీ నేతలు, ఉన్నతాధికారులు ఎందుకు కాలేకపోతున్నారన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు.

అందరి సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేడీ విజయావకాశాలపై సమాధానమిస్తూ.. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ తథ్యమని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరో అయిదేళ్లు మీరు పాలిస్తారా..? అన్న ప్రశ్నకు ఔనని సమాధానమిచ్చారు. జూన్‌ 9న మీరు సీఎంగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేడీ వర్గాలు అంటుండగా.. ప్రధాని మోదీ 10న భాజపా ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారుగా అన్న ప్రశ్నకు.. వేచి చూడమని చెప్పారు.

మీ తర్వాత పార్టీని నడిపించేవారెవరన్న ప్రశ్నకు.. రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని సమాధానం చెప్పారు. తనను ఈసారి ఎంతోమంది విమర్శించారని, తనపై దుష్ప్రచారం జరిగిందని అన్నారు. తాను ఎవరిపైనా ఆక్రోశం పెంచుకోలేదని, దీన్ని సున్నితంగా తీసుకున్నానని చెప్పారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏతో సంబంధాలు, పార్లమెంటులో బిల్లుల ఆమోదానికి బీజేపీ మద్దతు విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

Latest News