Weather Report | తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో మరో నాలుగురోజులు వర్షాలే..! తీపికబురు చెప్పిన ఐఎండీ

Weather Report | గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. ఇప్పటికే పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది.

  • Publish Date - May 13, 2024 / 07:32 AM IST

Weather Report | గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. ఇప్పటికే పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని ఉప-హిమాలయ ప్రాంతాలు కర్ణాటక, తమిళనాడుతో సహా గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి.

తుఫాను ప్రభావం చాలాచోట్ల కనిపిస్తున్నది. తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను సంభవించింది. అలాగే, చాలాచోట్ల వడగళ్ల వాన కురిసింది. చాలారాష్ట్రాల్లో వానలు ఈ నెల 16 వరకు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షానికి తోడు మెరుపులు, పిడుగులు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఐఎండీ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. బీహార్, జార్ఖండ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, గంగా నది పశ్చిమ బెంగాల్, ఒడిశా, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్ , మరాఠ్వాడా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచాయి.

ఐఎండీ ప్రకారం.. ఉత్తర పాకిస్తాన్‌లో ప్రస్తుతం వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ చురుగ్గా ఉన్నది. దాని ప్రభావంతో 14వ తేదీ వరకు తూర్పు, మధ్య భారతంలో మెరుపులు, బలమైన గాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో 16వ తేదీ వరకు అవే పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. కుండపోత వర్షాల కారణంగా వాయువ్య భారతంలో వాతావరణం చల్లబడింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలుపడిపోయాయి. జమ్మూ కశ్మీర్‌లో వాతావరణం మారిపోయింది.

Latest News