వ్యక్తిగత రుణం తీసుకొని చెల్లించకపోతే ఏం జరుగుతుంది? కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందా? భవిష్యత్తులో లోన్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయా? కేసులు కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం.
లోన్ తీసుకొని చెల్లించకపోతే ఏం జరుగుతుంది?
వ్యక్తిగత రుణాలు సులభంగా తీసుకోవచ్చు. పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేకుండానే వ్యక్తిగత రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలకు వడ్డీ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణం చెల్లించకపోతే ఏం జరుగుతోందో తెలుసుకుందాం. వ్యక్తిగత రుణం చెల్లించడంలో ఆలస్యమైతే లేట్ ఫీజు విధిస్తారు. చెక్ బౌన్స్ లకు రూ.400 నుంచి రూ. 500 ఛార్జీలను విధిస్తాయి. ఈఎంఐ చెల్లింపు తేది నుంచి ఏడు రోజుల వరకు గ్రేస్ పీరియడ్ గా పరిగణిస్తాయి. ఈ ఏడు రోజుల్లో కూడా డబ్బులు చెల్లించకపోతే ఫైన్ విధిస్తారు. వ్యక్తిగత రుణాల ఆలస్యంగా చెల్లిస్తే ప్రతి 15 రోజులకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి నివేదిక ఇవ్వాలి. ఆలస్యంగా ఈఎంఐలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. రెగ్యులర్ గా ఈఎంఐ చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.
లీగల్ నోటీసులు వస్తాయా?
వ్యక్తిగత రుణాలు సకాలంలో చెల్లించకపోతే లీగల్ నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంది. రుణం చెల్లించలేదనే సమాచారాన్ని బ్యాంకులు ఎప్పటికప్పుడు రుణ గ్రహీతకు అందిస్తాయి. అయినా కూడా స్పందించకపోతే రికవరీ ఏజంట్లకు ఈ కేసును అప్పగిస్తారు.అయితే రికవరీ ఏజంట్లు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు. ఆర్ బీ ఐ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. రికవరీ ఏజన్సీ రంగంలోకి దిగినా కూడా ఫలితం లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లీగల్ నోటీసులు పంపే ఛాన్స్ ఉంది.
సిబిల్ స్కోర్ పై ప్రభావం ఉంటుందా?
పర్సనల్ లోన్ సకాలంలో చెల్లించకపోతే అది సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. అంటే సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్తులో రుణాలు తీసుకోవాల్సి వస్తే ఎక్కువ వడ్డీరేటు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థలు ముందుకు రాకపోవచ్చు.
వ్యక్తిగత రుణం చెల్లించకపోతే ఏం జరుగుతుంది?
వ్యక్తిగత రుణాలుకొన్ని వేల రూపాయాల నుంచి లక్షల రూపాయాల వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణాలు కొన్ని రోజుల నుంచి సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. రుణాలపై వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది.తీసుకున్న రుణం చెల్లించకపోతే కోర్టుల్లో చట్టపరమైన చర్యలకు అవకాశం లేకపోలేదు. అంతేకాదు రుణగ్రహీత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవచ్చని కోర్టులు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. రుణాలు తీసుకున్న తర్వాత వాటిని సకాలంలో చెల్లించాలి.
