Woman Police | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే( Police ) తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. విధుల్లో ఉండగానే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పీకల దాకా మద్యం( Alcohol ) సేవించి.. మహిళలు( Women ), చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులంటేనే భయపడేలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు.
పశ్చిమ బెంగాల్( West bengal ) ప్రభుత్వం ఇటీవలే మహిళల భద్రత కోసం పింక్ మొబైల్ వ్యాన్లను( pink Mobile Vans ) ఏర్పాటు చేసింది. ఈ వ్యాన్లలో మహిళా పోలీసులు( Woman Police ) పెట్రోలింగ్ చేస్తూ, మహిళల భద్రతను పర్యవేక్షించనున్నారు. అయితే సిలిగురి( Siliguri )లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తనియా రాయ్( Taniya Roy ) తన సిబ్బందితో బుధవారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్నారు. తనియా అనే మహిళా పోలీసు ఆఫీసర్.. పీకల దాకా మద్యం సేవించి, ఓ ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించారు.
దీంతో స్థానికులు గమనించి.. తనియాను నిలదీశారు. మద్యం సేవించి, విధులు నిర్వర్తించడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో తనియా.. అక్కడున్న ఓ మహిళకు లిప్ కిస్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. తాను మద్యం సేవించానో లేదో చూడు అన్నట్టు లిప్ కిస్( Lip Kiss ) ఇవ్వబోయింది ఆమె. అంతటితో ఆగకుండా మరింత అనుచితంగా ప్రవర్తించిందామె.
ఇక ఏఎస్ఐ తనియా రాయ్‌పై అక్కడున్న మహిళలు దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగతా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా పోలీసుపై అటు నెటిజన్లు, ఇటు బీజేపీ నేతలు( BJP Leaders ) తీవ్రంగా స్పందించారు. పీకల దాకా మద్యం సేవించి విధుల్లో పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
পশ্চিমবঙ্গ পুলিশের অবস্থা দেখে মানুষ কেঁপে উঠবে।
শিলিগুড়ি মেট্রোপলিটান পুলিশের পিংক ভ্যান বাহিনী এএসআই তানিয়া রায় মদ্যপ অবস্থায় বুধবার একটি জুয়ার ঠেকে হানা দেন। সেখানেই এক মহিলাকে অসংলগ্ন অবস্থায় জড়িয়ে ধরেন যা ভিডিওতে স্পষ্ট দেখা যাচ্ছে। বহুবার ওনার বিরুদ্ধে মদ্যপ… pic.twitter.com/f49iSWnQyg— Samik Bhattacharya (@SamikBJP) October 24, 2024