YCP office | తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత..

YCP office | ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ వైసీపీ ఆక్రమణలపై దృష్టిపెట్టింది. ఇప్పటికే రుషికొండ కట్టడాలపై వివాదం కొనసాగుతుండగా.. తాజాగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామున ఐదుగంటలకే కూల్చివేతను మొదలుపెట్టి పూర్తిచేశారు. ప్రస్తుతం కూల్చివేసిన వైసీపీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది.

  • Publish Date - June 22, 2024 / 10:20 AM IST

YCP office : ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ వైసీపీ ఆక్రమణలపై దృష్టిపెట్టింది. ఇప్పటికే రుషికొండ కట్టడాలపై వివాదం కొనసాగుతుండగా.. తాజాగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామున ఐదుగంటలకే కూల్చివేతను మొదలుపెట్టి పూర్తిచేశారు. ప్రస్తుతం కూల్చివేసిన వైసీపీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది.

తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్న అధికారులు పొక్లైన్లు, బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. కాగా కూల్చివేతకు సీఆర్డీఏ (CRDA) ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైసీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది.

సీఆర్డీఏ (CRDA) కమిషనర్‌కు హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూటమి సర్కారు కూల్చివేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Latest News