Site icon vidhaatha

Bandi Sanjay : కాళేశ్వరం అవినీతి డైవర్ట్ చేయడానికే తెరపైకి కవిత అంశం

Bandi Sanjay

కాళేశ్వరం(Kaleshwaram) అవినీతిని డైవర్ట్ చేయడానికే తెరపైకి కవిత అంశాన్ని తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.బుధవారం ఆయన కరీంనగర్(Karimnagar) లో మీడియాతో మాట్లాడారు.బీఆర్ఎస్ కు కవిత రాజీనామా చేస్తే ఏమి అవుతోందని . . కవితను సస్పెండ్ చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అని ఆయన ప్రశ్నించారు. కవిత(Kavitha) ఎపిసోడ్ తో తెలంగాణకు ఏమైనా లాభం ఉందా అని ఆయన అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ పై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్(BRS) నాయకత్వం సెప్టెంబర్ 2న కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. కనీసం వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేశారని ఆమె విమర్శించారు. సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత(Kavitha) రాజీనామా చేశారు. మరోసారి కవిత హరీశ్ రావు, సంతోష్ పై ఆరోపణలు చేశారు. తనను పార్టీనుంచి బయటకు పంపేందుకు అనేక కుట్రల చేశారని ఆమె అన్నారు. తన లేఖ మీడియాకు ఎలా లీకైందని ఆమె ప్రశ్నించారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు, కవితకు మధ్య గ్యాప్ కొనసాగుతూ వచ్చింది. అది చివరకు ఆమె పార్టీకి దూరం కావడానికి కారణమైంది.

Exit mobile version