గడిచిన రెండేండ్లలో సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల హవా క్రమంగా పెరుగుతోంది. అంతకుముందు ఇండస్ట్రీలోకి రావడానికి జంకిన ముద్దుగుమ్మలు నేటి కాలానుగుణంగా మారుతూ ధైర్యంగా ముందడుగు వేసి తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళుతున్నారు.
ఆక్రమంలో ఇప్పటికే ఇషా రెబ్బా, అనందిని, శ్రీవిధ్య, అనన్య నాగళ్ల, ప్రీతి అశ్రాని వంటి, అవంతిక వందనపు, ప్రీతి పగడాల వంటి యువ నటీమణులు తెలుగులోనే కాకుండా ఇతర భాషల చిత్రాల్లో రాణిస్తున్నారు.
తాజాగా ఈ కోవలో మరో ముద్దుగుమ్మ యశ్న ముత్తులూరి (Yashna Muthuluri) చేరింది.ఇప్పటికే షార్ట్ ఫిలింస్, చిన్న చిత్రాల వంటివి డజన్ పైనే చేసిన గుర్తింపు దక్కించుకో లేక పోయింది.
కానీ గత సంవత్సరం త్రిష మెయిన్ లీడ్‌గా వచ్చిన వెబ్ సిరీస్ బృంద (Brinda) లో త్రిషకు చెల్లెలిగా అలరించి ఒక్కసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
అ ఒక్క సీరిస్‌లోని పాత్రతో ఎవరీ అమ్మాయి అంటూ సెర్చ్ చేసేలా చేసింది. ఇటీవల సత్యరాజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బార్బరిక్ చిత్రంలో కీ రోల్ చేస్తున్న ఈ చిన్నది
తన డ్రెస్సింగ్‌తో అక్కడి వారిని షాక్ గురి చేయడమే కాక గ్లామర్ పాత్రలకు సై అనేలా హింట్ ఇచ్చింది. మీరూ ఆ అచ్చ తెలుగందాలను చూసి అస్వాదించండి మరి.