విధాత : సమాజంలో కుల వివక్షత నిర్మూలనకు రోహిత్ వేముల చట్టం తేవాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లేఖలు రాశారు. ముందుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సింగ్ సుఖులకు లేఖ రాశారు. విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది వివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
రోహిత్ వేముల, సోలంకి హత్య ఆమోదయోగ్యం కాదన్నారు. విద్యావ్యవస్థలో కులవివక్షతో అన్యాయం జరగకూడదన్నారు. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. కుల వివక్ష లేకుండా ప్రతి బిడ్డకు సమాన విద్య అందించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు రాహుల్ గాంధీ సూచించారు.