వేసవిలో మాత్రమే అందుబాటులో ఉండే మామిడిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారు మామిడిని తినడం సురక్షితమా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం, షుగర్ పేషెంట్లు మామిడిని తినవచ్చు కానీ పరిమిత మోతాదులో మాత్రమే తినాలని హెచ్చిరిస్తున్నారు.
మామిడిలోని కేలరీలు ఎక్కువగా చక్కెర నుంచి వస్తాయి, కాబట్టి అధికంగా తినడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవచ్చు. అయితే, మామిడి గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమంగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు కొంతవరకు సురక్షితం.
ఎలా తినాలి?
రోజుకు ఒక చిన్న మామిడి లేదా ఒక చిన్న ముక్క తినడం సరిపోతుంది.
అధికంగా తినడం రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలన్స్‌గా ఉండవు.
మామిడి తిన్న వెంటనే ప్రోటీన్ ఆహారాలు (ఉదాహరణకు, బాదం, గట్టి పెరుగు, లేదా ఉడికించిన గుడ్డు) తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
మామిడిలో స్వల్పంగా ప్రోటీన్ ఉండటం వల్ల షుగర్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు మామిడిని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. సరైన మోతాదులో మరియు సమతుల్య ఆహారంతో తీసుకుంటే, ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.