విధాత,అమరావతి: కళాశాల విద్యలో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల(ఆర్జేడీ) పోస్టులు రద్దు కానున్నాయి. వీరికి సంబంధించిన అధికారాలను సంయుక్త కలెక్టర్లకు బదలాయించనున్నారు. డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీ బాధ్యతలను జేసీలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం కడప ఆర్జేడీ పరిధిలో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉండగా.. గుంటూరు ఆర్జేడీ పరిధిలో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు రాజమహేంద్రవరం ఆర్జేడీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్ల కళాశాలల ప్రిన్సిపాళ్లే ఇన్‌ఛార్జి ఆర్జేడీలుగా కొనసాగుతున్నారు. ఈ పోస్టులు రద్దు చేసి, వీరిని ప్రిన్సిపాళ్లుగా కళాశాలలకు పంపనున్నారు.
కొత్తగా 93 జూనియర్ కళాశాలలు
రాష్ట్ర వ్యాప్తంగా 93 మండలాల్లో కొత్తగా జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న, మౌలికసదుపాయాలున్న ఉన్నత పాఠశాలలను గుర్తించాలని జిల్లా వృత్తివిద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మండలానికో జూనియర్ కళాశాల, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండోది ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను గుర్తించే చర్యలు చేపట్టారు.
కళాశాల విద్యలో ఆర్జేడీ పోస్టులు రద్దు.
<p>విధాత,అమరావతి: కళాశాల విద్యలో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల(ఆర్జేడీ) పోస్టులు రద్దు కానున్నాయి. వీరికి సంబంధించిన అధికారాలను సంయుక్త కలెక్టర్లకు బదలాయించనున్నారు. డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీ బాధ్యతలను జేసీలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం కడప ఆర్జేడీ పరిధిలో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉండగా.. గుంటూరు ఆర్జేడీ పరిధిలో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు రాజమహేంద్రవరం ఆర్జేడీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం […]</p>
Latest News

కోటీశ్వరుడిగా మారిన 3 రూపాయాల వ్యవసాయ కూలీ.. ఇది ఓ కశ్మీరీ రైతు విజయగాథ..!
లెక్చరర్‌తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్..
అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుందట..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు
ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి