All Party Meeting |
విధాత: పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాలపై చర్చించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉగ్రదాడి ఘటన, తదనంతరం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రులు అఖిల పక్ష పార్టీలకు వివరించారు.
ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో..పాకిస్తాన్ పట్ల అనుసరించాల్సిన విషయంలో ఆయా పార్టీల సలహాలను కోరారు. ఈ సందర్భంగా పలు పార్టీలు కేంద్రానికి కీలక సూచనలు చేశాయి. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో సీఎం ఓమర్ అబ్ధుల్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉగ్రదాడిని ఖండిస్తూ తీర్మానం చేశారు. పహల్గాం ఉగ్రదాడి కారకులను శిక్షించేందుకు కేంద్రం చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.