మన దేశంలో వయస్సు పెరిగినా వన్నెతగ్గని ప్రముఖ నటులలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirnajeevi) ఒకరు . ఒకదాని వెంట మరొక సినిమా చేసుకుంటూ, యువ హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర(Viswanbhara) పూర్తి చేసే పనిలో ఉన్న మెగాస్టార్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ఒకటి హీరో నాని (Hero Nani) సమర్పణలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి. అదే ఇప్పడు సెన్సేషన్ అయి కూర్చుంది.
దసరా(Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో నటించే చిత్రానికి మెగాస్టార్ రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకోబోతున్నారు. ఈ చిత్రానికి చెరుకూరి సుధాకర్(Cherukuri Sudhakar) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్‌కు 75 కోట్ల (75 Crores) భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసారట. అంతేకాకుండా, అందులో కొంత మొత్తం ఇప్పటికే అడ్వాన్స్‌గా చెల్లించారని తెలిసింది. ప్రస్తుతం శ్రీకాంత్ నాని హీరోగా ది ప్యారడైజ్(The Paradise) చిత్రానికి పనిచేస్తున్నాడు. నాని తను హీరోగా హిట్3(Hit 3) షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల శ్రీకాంత్ సినిమా ఆగింది. ఈ ఖాళీ సమయాన్ని చిరంజీవి సినిమా స్క్రిప్ట్ కోసం ఉపయోగించుకుంటున్నాడు తను. ది ప్యారడైజ్ సినిమా పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు.
మెగాస్టార్ సినిమాను నవ్య రీతిలో తెరకెక్కించాలనుకుంటున్న శ్రీకాంత్ దీన్ని 90వ దశకంలోని ఒక గ్యాంగ్‌స్టర్(90s Gangster) కథతో తీస్తున్నాడట. చిరంజీవి వయసుకు తగ్గ పాత్రను రూపొందించిన దర్శకుడు ఇందులో పాటలేవీ ఉండవని, ఇంటెన్స్ డ్రామాతో కథ ఉండబోతోందని చెబుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎంతో ముఖ్యమవడంతో, అందులోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్‌కు చాలా ప్రాముఖ్యత ఉండటంతో యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)ను ఎంచుకున్నాడట. ఇప్పటికే రక్తంతో తడిసిన చేయితో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నాని, ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. తనలాంటి చిరంజీవి అభిమానులకు విభిన్నమైన అనుభూతిని ఇవ్వబోతోందని నాని ధీమాగా ఉన్నాడు.