Site icon vidhaatha

పిల్లల కోసం కరోనా గైడ్‌లైన్స్

విధాత:దేశంలో మూడో వేవ్ కరోనా వైరస్ విజృంభించబోతుందని.. ఈ వేవ్ ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. 18ఏళ్ల లోపున్న పిల్లలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే.. వారికి యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ వాడొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచించింది. ఐదు లేదా అంతకన్న తక్కువ వయుసున్న చిన్నారులకు మాస్క్ అవసరం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ఆరు నుంచి 11ఏళ్ల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్కు పెట్టుకోవచ్చిని సూచించింది.

కాగా.. జాతీయ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌‌లో సభ్యులుగా ఉన్న భారత అగ్రశ్రేణి వైద్యులు మాత్రం పిల్లలకు థర్డ్ వేవ్ ముప్పును సూచించే ఎటువంటి సమాచారం లేదని అంటున్నారు. అయినా కూడా కేంద్రం మాత్రం పిల్లల కోసం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. రెండో వేవ్‌లో కరోనా సోకిన మరియు ఆస్పత్రిలో చేరిన 60 నుంచి 70 శాతం మంది పిల్లలు తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని అన్నారు. అయితే ఆరోగ్యవంతమైన పిల్లలు మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండానే కోలుకున్నారని ఆయన తెలిపారు.

కేంద్రం విడుదల చేసిన గైడ్‌లైన్స్

తేలికపాటి లక్షణాలు

మధ్యస్థ లక్షణాలు

తీవ్రమైన లక్షణాలు

Exit mobile version