విధాత : మేడిగడ్డ బ్యారేజి కుంగిన సంఘటనలో 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు ‘విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ సిఫార్సు చేసింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో పాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణా రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. 17 మంది ఇంజనీర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన మరో 30 మంది ఏఈఈలు, డీఈఈలపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిలపై కూడా చర్యలకు సిఫారసు చేసింది.
మేడిగడ్డ నిర్వహణ, మరమ్మతులలో ఇంజనీర్ల సూచనలను పట్టించుకోకపోవడంపై, డిఫెక్ట్ లాయబులిటీ పీరియడ్ లో ఉండికూడా మరమ్మతులు చేపట్టపోవడంతపపై నిర్మాణ సంస్ధ ఎల్ ఆండ్ టీ పై కూడా చర్యలకు విజిలెన్స్ ఆండ్ ఎన్ ఫోర్స్ కమిటి సిఫారసు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇరిగేషన్ శాఖకు అందిన నివేదికను అధికారులు అధ్యాయం చేస్తున్నారు. మరోవైపు తాజా నివేదికలో ఉన్న అధికారుల శాఖపరమైన పదోన్నతుల ప్రక్రయను ఆపివేశారు.
త్వరలోనే జ్యూడీషియల్ నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ జరుపుతున్న విచారణ కూడా తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాజెక్ట్ అధికారులు, ఈఎన్ సీలు, రిటైర్డ్ ఈఎన్ సీలు, ఇంజనీర్లు, ఐఏఎస్ఆధికారులు, కాగ్ అధికారులు సహా112 మంది నుంచి స్టేట్ మెంట్లను కమిషన్ రికార్డ్ చేసింది. అధికారుల విచారణ పూర్తవడంతో.. ఇక కమిషన్ పూర్తి స్థాయి ఫోకస్ అంతా రిపోర్ట్ పైనే పెట్టింది. శనివారం రాష్ట్రానికి చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ ప్రక్రియపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ రిపోర్టును తయారు చేసుకుంటున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారు.