Site icon vidhaatha

BCCIలో ఎన్నికల కోలాహలం

విధాత‌:కొత్త ఏడాదిలో భారతీయ క్రికెట్ నియంత్రణ సంస్థకు కొత్త కార్యదర్శి, కొత్త కోశాధికారి రానున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా పని చేస్తున్న జై షా ఐసీసీ చైర్మన్‌గా, బిసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ మేరకు బోర్డు కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి.

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లోపు ఎన్నుకోవాలి. ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని నియమించాలి. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం వచ్చే ఏడాది జనవరి 12న ఎన్నికలు నిర్వహించి, ఆరోజు జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశాన్ని వచ్చే ఏడాది జనవరి 12న ముంబైలో నిర్వహించనున్నారు.

అదే రోజు కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల అధికారిగా మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అచల్‌కుమార్‌ జ్యోతిని నియమించారు. ఈ మేరకు అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం పంపారు.

కాగా.. ప్రస్తుతం అస్సాంకు చెందిన దేవ్‌జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్‌తోపాటు దేవ్‌జిత్ సైకియా కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ రెండు పదవులు ఏకగ్రీవం కావొచ్చని బిసిసిఐ ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు.

Exit mobile version