విధాత: సౌత్ నుంచి మరో స్టార్ హీరో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ధనుష్, కిచ్చా సుదీప్ హిందీలో తమ సత్తా చాటగా తాజాగా మలయాళం నుంచి ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) ఈ లిస్టులో చేరాడు.
గతంలో కేరళ నుంచి ఇప్పటివరకు దర్శకులు చాలామందే బాలీవుడ్‌లో తమ సత్తా చాటగా మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, రోషన్ మాథ్యూస్ వంటి ఒకరిద్దరు హీరోలు మాత్రమే అక్కడి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా పుష్ఫ, పుష్ఫ2 సినిమాల్లో బన్వర్ సింగ్ షకావత్ పాత్రతో దేశ వ్యాప్తంగా ఫాహద్ ఫాజిల్ (FahadhFaasil) పేరు దక్కించుకున్నాడు.
ఈనేపథ్యంలోనే బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని 2025లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఫాజిల్‌కు జతగా లేటెస్ట్ నేషనల్ క్రష్ త్రిప్తి డుమ్రి కథానాయుకగా నటించనుంది.