Site icon vidhaatha

GHMC టౌన్‌ప్లానింగ్‌ ప్రక్షాళన.. ఒకే రోజు 27 మంది బదిలీ

GHMC | Hyderabad

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఒకే రోజు 27 మంది అధికారులు బదిలీ అయ్యారు. ప్రజావాణిలో అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే రోజు 27 మంది అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మిక బదిలీలతో టౌన్ ప్లానింగ్ అధికారులు షాక్ లో ఉన్నారు. ఆరు జోన్ల పరిధిలో అధికారుల బదిలీలు ఉన్నాయి.

బదిలీ అయ్యింది వీరే..

మెహిదీపట్నం ఏసీపీగా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్‌కు బదిలీ..
గాజుల రామారం ఏసీపీగా సుమిత్రకు పోస్టింగ్
అల్వాల్ ఏసీపీగా శ్రీనివాస్ రెడ్డికి పోస్టింగ్‌
కర్వాన్ నుంచి సికింద్రాబాద్ ఏసీపీగా పావని బదిలీ
హయత్ నగర్ ఏసీపీగా విజయలక్ష్మి బదిలీ
హెడ్ ఆఫీస్‌కు ఏసీపీగా నరేష్‌కు పోస్టింగ్
సెక్షన్ నుంచి ఏసీపీగా సుధాకర్‌ను ప్రమోగ్ చేస్తూ చంద్రాయణగుట్టలో పోస్టింగ్
రమేష్ కుమార్‌కు కూకట్‌పల్లి ఏసీపీ నుంచి గోషామహల్‌కు బదిలీ
తాండూరు నుంచి ఏసీపీగా శేరిలింగంపల్లి జోనల్‌కు లాలప్ప బదిలీ
జీషణ్‌ను సెక్షన్ ఆఫీసర్ నుంచి ఏసీపీగా ప్రమోట్ చేస్తూ కూకట్‌పల్లి ఏసీపీగా బదిలీ
భానుచందర్‌ ఏసీపీ – చంద్రయాన్ గుట్ట నుంచి సంతోష్ నగర్‌కు బదిలీ
మంజుల సింగ్‌‌ ఏసీపీ – గోషామహల్ నుంచి కులీకుతుబ్‌షా ఏసీపీగా బదిలీ
ఏసీపీ స్వామి – సంతోష్ నగర్ నుంచి మెహదీపట్నంకు బదిలీ
పీ రమేష్ సెక్షన్ ఆఫీసర్‌ – కుత్బుల్లాపూర్ నుంచి చందానగర్ బదిలీ
ఎండీ అగ్బర్ అహ్మద్ సెక్షన్ ఆఫీసర్‌ – హయత్ నగర్ నుంచి శేరిలింగంపల్లికి బదిలీ
ఎస్‌కే సురేష్ కుమార్ సెక్షన్ ఆఫీసర్‌ – ఉప్పల్ నుంచి జూబ్లీహిల్స్‌కు బదిలీ
మహేందర్ సెక్షన్ ఆఫీసర్‌ – ఫలక్‌నుమా నుంచి గోషామహల్‌కు బదిలీ
జేకే నరేష్ సెక్షన్ ఆఫీసర్‌- గోషామహల్ నుంచి చార్మినార్‌కు బదిలీ
సోమేశ్వర్ – కూకట్పల్లి నుంచి హయత్ నగర్ సర్కిల్‌కు బదిలీ
తుల్జాసింగ్ సెక్షన్ ఆఫీసర్ – గాజులరామారం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు బదిలీ
నరేష్ సెక్షన్ ఆఫీసర్ – యూసఫ్‌గూడా నుంచి ఫలక్‌నుమాకు బదిలీ
మధు సెక్షన్ ఆఫీసర్ – పటాన్‌చెరు నుంచి కూకట్‌పల్లికి బదిలీ
బీవీ ప్రకాష్ సెక్షన్ ఆఫీసర్ – కార్వాన్ నుంచి మెహిదీపట్నంకు బదిలీ
రోహన్ ఠాకూర్ సెషన్ ఆఫీసర్ – చందానగర్ పోస్టింగ్..
రామచందర్ సెక్షన్ ఆఫీసర్ – సరూర్ నగర్ నుంచి ఫలక్‌నుమాకు బదిలీ
ముకేష్ సింగ్ సెక్షన్ ఆఫీసర్ – చార్మినార్ నుంచి గాజుల రామారం బదిలీ
ప్రభావతి – కార్వాన్ సెక్షన్ ఆఫీసర్‌గా పోస్టింగ్..

Exit mobile version