Site icon vidhaatha

Good News: సెర్ఫ్‌లో సాధారణ బదిలీలకు రంగం సిద్దం.. జీవో జారీ

విధాత : సెర్ఫ్ లో 100శాతం సాధారణ బదిలీలకు అనుమతులు ఇస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క జీవో జారీ చేశారు. దీంతో 10 సంవత్సరాల తర్వాత సెర్ఫ్ లో సాధారణ బదిలీలు జరుగనున్నాయి. సెర్ఫ్ పరిధిలో 3,974మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా పది సంవత్సరాలుగా బదిలీలు లేకపోవడంతో బదిలీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది.

చాలా మంది సిబ్బంది ఒకే చోట పాతుకుపోవడంతో.. పనుల్లో వేగం పెంచేందుకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం సెర్ఫ్ ద్వారా ఇందిరా మహిళా శక్తి పాలసీ అమలు చేస్తుంది. మహిళా సంఘాలను స్వయం ఉపాధి నుంచి ఉపాధి కల్పన, సంపద సృష్టి దిశగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ వేగవంతం కోసం బదిలీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.

Exit mobile version