హైదరాబాద్: ప్రముఖ జనరిక్ ఇంజెక్టబుల్, ఆప్తాల్మిక్-కేంద్రీకృత ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, తమ యాంజియోటెన్సిన్ II ఎసిటేట్ ఇంజెక్షన్ (2.5 mg/mL) కోసం యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యు.ఎస్.ఎఫ్.డి.ఎ.) నుండి ఆమోదం పొందింది. ఈ ఉత్పత్తి రెఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ (ఆర్.ఎల్.డి.), లా జొల్లా ఫార్మా ఎల్.ఎల్.సి. వారికి చెందిన జియాప్రెజాకు బయోఈక్వివలెంట్, థెరప్యూటికల్లీ ఈక్వివలెంట్. సెప్టిక్ లేదా ఇతర డిస్ట్రిబ్యూటివ్ షాక్‌తో బాధపడుతున్న పెద్దలలో రక్తపోటును పెంచడానికి ఈ ఉత్పత్తిని సూచిస్తారు.
గ్లాండ్ ఫార్మా ఈ విభాగంలో ఎక్స్‌క్లూజివ్ ‘ఫస్ట్-టు-ఫైల్’ హోదాను కలిగి ఉంది. దీనికి 180 రోజుల జనరిక్ డ్రగ్ ఎక్స్‌క్లూజివిటీ లభిస్తుంది. ఐ.క్యూ.వి.ఐ.ఏ. అంచనాల ప్రకారం, మార్చి 2025తో ముగిసిన 12 నెలల కాలంలో ఈ ఉత్పత్తి యు.ఎస్. విక్రయాలు సుమారు 58 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 1978లో హైదరాబాద్‌లో స్థాపించిన గ్లాండ్ ఫార్మా, చిన్న-పరిమాణ లిక్విడ్ పారెంటెరల్ ఉత్పత్తుల కాంట్రాక్ట్ తయారీదారు నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజెక్టబుల్స్-కేంద్రీకృత కంపెనీలలో ఒకటిగా ఎదిగింది.
యునైటెడ్ స్టేట్స్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా సహా 60 దేశాలలో దీనికి ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ ప్రధానంగా బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) మోడల్‌లో పనిచేస్తుంది. స్టెరైల్ ఇంజెక్టబుల్స్‌ను అభివృద్ధి చేయడంలో, తయారు చేయడంలో, మార్కెటింగ్ చేయడంలో గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. వైల్స్, ఆంపూల్స్, ప్రీ-ఫిల్డ్ సిరంజిలు, లియోఫిలైజ్డ్ వైల్స్, డ్రై పౌడర్‌లు, ఇన్ఫ్యూజన్‌లు, ఆంకాలజీ, ఆప్తాల్మిక్ సొల్యూషన్‌లు వంటి అనేక రకాల ఇంజెక్టబుల్స్ దీనికి ఉన్నాయి.