విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి హరీష్ రావుకు మరోసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ నోటీసుల మేరకు మంగళవారం హరీష్ రావు కమిషన్ ముందు హాజరుకానున్నారని సమాచారం. అయితే మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత హరీష్ రావు కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ కేబినెట్ తీసుకున్న అంశాలు..గత విచారణ సందర్భంగా హరీష్ రావు వెల్లడించిన సమాచారాన్ని విశ్లేషించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు.
అటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ గ్రౌంటింగ్ పై ఈఎన్సీ అనిల్ కుమార్ ను మరోసారి ప్రశ్నించేందుకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో అనిల్ కుమార్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. గ్రౌంటింగ్ పై వివరణ ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ ఈనెల 11న తిరిగి కోల్ కత్తా వెళ్లిపోనున్న నేపథ్యంలో ఇంతలోగా తుది విచారణ ప్రక్రియ పూర్తి చేసి..నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారని సమాచారం.