Site icon vidhaatha

Revanth Reddy: తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అయితడా.. త్యాగాలు చేసినోళ్లు అయితరా

కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శ

విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణకు జాతిపిత తాగుబోతోడు అయితడా.. త్యాగాలు చేసినోళ్లు అయితరా…అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు.జాతిపిత అంటే స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసి, ఆశ్రమాల్లో ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన నిరాడంబరంగా ఉన్నారు.. ఈయన ఉంటారా అని ప్రశ్నించారు.

ఆ జాతిపిత ఎక్కడ.. ఈ జాతిపిత ఎక్కడ.. అని ప్రశ్నించారు. కేసీఆర్ జాతిపిత అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంటుందని అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జాతిపిత అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. జాతి పిత అంటే అన్నీ పోగొట్టుకున్న కొండా లక్షణ్ బాపూజీనో.. సర్వం సమర్పించుకున్న ప్రొ.జయశంకర్ సారో జాతిపిత అవుతారు గానీ.. అబద్ధాలు చెప్పేటోడు.. టీవీలు, పేపర్లు పెట్టుకుని.. లక్షల కోట్లు దోచినోళ్లు వందల ఎకరాల ఫామ్ హౌజ్ లున్నవారు జాతిపిత ఎట్ల అవుతారని సీం ప్రశ్నించారు.

 

Exit mobile version