Rain Alert : రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణశాఖ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. గత రెండ్రోజులుగా హైదరాబాద్ సహా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే వాతావరణశాఖ వర్షాలకు సంబంధించిన మరో అప్ డేట్ ఇచ్చింది. రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పు అరేబియా సముద్రం.. దక్షిణ కొంగణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది.
ఈ అల్ప పీడనం ఉత్తరదిశగా కదులుతూ రాగల 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తున్నది. మరోవైపు 27న పశ్చిమ మధ్య సమీపంలోని ఉత్తరబంగాళాఖాతంలోనూ అల్ప పీడనం ఏర్పడనున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.