Rakul Preet Singh:
ఒకప్పుడు బన్నీ, రామ్ చరణ్, మహేశ్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) కొంతకాలంగా తెలుగుతెరకు తెరమరుగైంది.
రకుల్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో తాను ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చుకుంది. 80 కేజీల బరువు ఎత్తే క్రమంలో తీవ్ర గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
అందుకే నేను సినిమాలకు దూరయ్యాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. కాకపోతే వెన్ను గాయం తగ్గడానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలో తన అభిమానులకు రకుల్ ఆరోగ్య సూచనలు ఇస్తోంది. ‘ మీ బాడీ మాట వినండి, దాని పరిమితికి మించి ఇబ్బంది పెట్టకండి. నేను జీవితంలో అదే తప్పు చేశాను.
దానినుండి కోలుకోవడానికి ఇంత సమయం పట్టింది. వచ్చే ఏడాది మూడు ప్రాజెక్టులతో మళ్లీ మీ ముందుకు వస్తున్నా’ అని తెలిపింది రకుల్.