విధాత: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్టు డీడ్ రిజిస్టేషన్‌కు సీజేఐ హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు సీజే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడారు.
‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారు. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం మొదలైంది. దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైంది. ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తుంది. ఆర్బిట్రేషన్ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం హామీ ఇచ్చారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నాను. త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాను’.
‘ఆర్బిట్రేషన్ కేంద్రానికి ఒప్పందం తెలంగాణకు చారిత్రక ఘట్టం. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు నా స్వప్నం. దీని కోసం 3 నెలల క్రితం ప్రతిపాదన చేశాను. నా స్వప్నం సాకారానికి 3 నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదు. నా ప్రతిపాదనకు సీఎం సత్వరమే స్పందించారు. ఈ కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. నా కల సాకారానికి కృషి చేస్తున్న కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీకి కృతజ్ఞతలు’ అని సీజేఐ అన్నారు.
తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ.. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, పీవీ హయాంలోనే ఆర్బిట్రేషన్ చట్టం రూపుదిద్దుకుందని జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్
<p>విధాత: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్టు డీడ్ రిజిస్టేషన్‌కు సీజేఐ హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు సీజే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడారు.‘అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారు. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారు. 1926లో […]</p>
Latest News

విమానం లాంటి వందేభారత్ స్లీపర్ రైలు : వేగం, సౌకర్యాల కలబోత
ఆ పరీక్షలో ఫెయిలైతేనే మంచిది : సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ ట్వీట్
ఐసీసీ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్
తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి : కవిత
కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్ది ద్రోహం, కాంగ్రెస్ది నిర్లక్ష్యం!
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
జనవరి 1 నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు : మంత్రి పొన్నం ప్రభాకర్