Site icon vidhaatha

IT RIDES: మూడో రోజు.. టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైడ్స్

విధాత‌: టాలీవుడ్ నిర్మాతలపై మూడో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు ప్ర‌తి అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు.

ఈక్ర‌మంలో నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, డైరెక్టర్ సుకుమార్, మాంగో అధినేత రామ్, సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇండ్లు, ఆఫీసులతో పాటు సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ఇండ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను ఇన్కమ్ టాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.

Exit mobile version