Site icon vidhaatha

Kaleshwaram | కాళేశ్వరం.. మలి దశ విచారణ షురూ!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవతవకలపై నియమించబడిన జస్టిస్ పీసీ. ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియ్యనుంది. విచారణ ప్రక్రియ తుది దశలో ఉన్నందునా…కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పెంచే అవకాశముందని సమాచారం. కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై విచారణ కోసం గత ఏడాది మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో విచారణ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే పలుసార్లు కమిషన్ గడవును పొడిగించగా ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. మరో రెండు నెలల గడువు పొడిగించనున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే జరిపిన విచారణ వివరాలతో దాదాపు 90 శాతం రిపోర్ట్ ను కమిషన్ సిద్దం చేసింది. గురువారం నుంచి జస్టిస్ ఘోష్ కమిషన్ మలిదశ విచారణ ప్రారంభించింది. ఇంజినీర్ల అఫిడవిట్ల ఆధారంగా వారిని ప్రశ్నించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ ఘోష్ విచారణ కొనసాగించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్ట్ ను కమిషన్ స్టడీ చేస్తుంది. ఇప్పటి వరకు వివిధ కోణాల్లో ఇంజినీర్లను, నిర్మాణ సంస్థలను ప్రశ్నించి వారి వద్ద నుంచి అఫిడవిట్లను స్వీకరించిన కమిషన్ త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు అప్పటి మంత్రులు హరీశ్ రావు, ఈటల ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాళేశ్వరంపై 400 పేజీల నివేదిక

కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించిన కమిషన్ దాని ఆధారంగా 400 పేజీల నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసిన కమిషన్ ఎన్‌డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తది నివేదిక కోసం ఎన్డీఎస్ఏ‌కు మరోసారి లేఖ రాసింది. ఆ నివేదిక మరో మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టును అందజేయనుంది. కమిషన్ ఫైనల్ రిపోర్టు రెండు మూడు వారాల్లో పూర్తి కానుందని కమిషన్ వర్గాల కథనం.

Exit mobile version