KALESWARAM COMMISSION | కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావాల్సిన తేదీలను మార్చుతూ ఈ నోటీసులు అందించారు. జూన్ ఆరవ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావుకు రావాలని కోరారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఆరవ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటల కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉన్నది. అయితే.. ఈ తేదీలను అటుదిటు ఇటుదటు మార్చడం ఆసక్తి రేపింది. ఈటల రాజేందర్ బీఆరెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాతి రాజకీయ పరిణామాల్లో బీఆరెస్‌ను వదిలి, బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ముందుగా ఈటలను పిలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను కమిషన్ ఎదుట హాజరై వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని ఇప్పటికే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ముందుగా హరీశ్ నుంచి వివరాలు తీసుకునేబదులు.. ఈటల నుంచి తీసుకోవడం ఉపయగకరమని కమిషన్ భావించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేసీఆర్, హరీశ్‌ను ఇరకాటంలో పడేసినట్టు అవుతుందని అంటున్నారు.
KALESWARAM COMMISSION | కాళేశ్వరం విచారణలో కీలక ట్విస్ట్
KALESWARAM COMMISSION | కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావాల్సిన తేదీలను మార్చుతూ ఈ నోటీసులు అందించారు. జూన్ ఆరవ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావుకు రావాలని కోరారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఆరవ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటల కమిషన్ […]

Latest News
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!