Site icon vidhaatha

MAX OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీకి.. సుదీప్ అదిరిపోయే యాక్ష‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే?

విధాత‌: గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాన్ ఇండియాగా ప్రేక్ష‌కుల ముందుకు అల‌రించిన క‌న్న‌డ చిత్రం మ్యాక్స్ (Max). క‌న్న‌డ స్టార్ సుదీప్ (Sudeepa) హీరోగా న‌టించిన ఈ చిత్రం థేయేట‌ర్ల వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. క‌న్న‌డ నాట విడుద‌లైన మూడు రోజులకు తెలుగులోనూ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఇక్క‌డా మంచి ఆద‌ర‌ణ‌నే ద‌క్కించుకుంది. విజ‌య్ కార్తికేయ (Vijay Karthikeyaa) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా త‌మిళ అగ్ర నిర్మాత క‌ళైపులి థాను (Kalaippuli S. Thanu), సుదీప్ (Sudeepa) నిర్మించారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ (Varalaxmi Sarathkumar), సునీల్ (Sunil), సుకృత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నెల‌న్న‌ర త‌ర్వాత ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. అయితే ఈ మూవీ కార్తి ఖైదీ సినిమాను త‌ల‌పించినా ఎక్క‌డా బోర్ అనేది లేకుండా చివ‌రి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. అర్జున్ ఓ పేరుపొందిన‌ పోలీసాఫీస‌ర్‌. ఓ కేసు విష‌యంలో స‌స్పెండ్‌ అయి మ‌రో స్టేష‌న్‌కు బ‌దిలీ అవుతాడు. అదే స‌మ‌యంలో త‌ను విధుల్లోకి వెళుతున్న పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ మ‌హిళా పోలీసుతో ఆ రాష్ట్ర మంత్రుల కుమారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో లోక‌ల్ పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. కానీ అదే రోజు రాత్రి వారిద్ద‌రు మ‌ర‌ణిస్తారు. అయితే అరెస్టు చేయ‌బ‌డ్డ త‌మ కుమారుల‌ను విడిచి పెట్టాలంటూ పై అధికారులు, మంత్రుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అంతేగాక ఆ మంత్రుల‌కు సంబంధించిన రౌడీ మూక‌లు పోలీస్‌స్టేష‌న్‌పై దాడి చేయ‌డానికి రెడీ అవుతారు. అస‌లు విష‌యం తెలుసుకున్న‌ అర్జున్ స్టేష‌న్‌కు చేరుకుని తోటి పోలీసుల‌కు అండ‌గా ఉంటూ రౌడీ మూక‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ద‌మ‌వుతాడు.

ఈ నేప‌థ్యంలో ఆ స్టేష‌న్‌కు క్రైమ్ సీఐ రూప ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ‌ మ‌లుపు తిరుగుతుంది. అస‌లు మంత్రి కుమారులు చ‌నిపోయిన‌ట్లు బ‌యటి ప్ర‌పంచానికి తెలియ‌కుండా పోలీసులు చేసే ప్ర‌య‌త్నాలు, ఒక గ్యాంగ్ త‌ర్వాత మ‌రో గ్యాంగ్ స్టేష‌న్‌పై దండెత్తుతూ ఉండ‌డం, పోలీసులు వారిని ఎదుర్కోవ‌డం వంటి ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల మ‌ధ్య సినిమా ఆద్యంతం మూవీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడీ సినిమా ఫిబ్ర‌వ‌రి 15 శ‌నివారం నుంచి జీ5 (Zee 5) తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది. అంతేగాక వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా జీ క‌న్న‌డ (Zee Kannada) ఛాన‌ల్‌లో ప్ర‌సారం కానుండ‌డం విశేషం. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, అదిరిపోయే యాక్ష‌న్ చిత్రం కావాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ మ్యాక్స్ (Max) మూవీని మిస్స‌వ‌కుండా చూడండి. డోంట్ మిస్‌.

Exit mobile version