Dr Shivaraj Kumar
విధాత: కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (Dr Shivaraj Kumar) అనారోగ్యంతో బాధ పడుతోన్న విషయం ఇటీవల హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనకు క్యాన్సర్ సోకినట్లు, ఆయన ఆరోగ్యం విషయంలో రోజుకోరకమైన వార్తలు బాగా హలచల్ చేస్తుండడంతో ఆయన అభిమానులతో పాటు కన్నడిగులంతా తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స నిమిత్తం గత గురువారం అమెరికా వెళ్లారు.
ఈ క్రమంలో ఆయన ఎయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. నేను క్షేమంగానే ఉన్నా, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంతా మంచే జరుగుతుంది. ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను. అయితే ఇప్పుడు మాత్రం నా కుటుంబసభ్యులు, అభిమానులను చూసినప్పుడు కాస్త ఎమోషనల్ అయ్యానని అన్నారు. ఈ మాటలతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ, ఓ రకమైన భయాoదోళనలో ఉన్నారు.
అయితే ఇప్పుడు కన్నడిగులకు, ఆయన ఫ్యాన్స్ ఎగిరి గంతేసే వార్తను డాక్టర్లు వెల్లడించారు. అమెరికాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్ల నేతృత్వంలో ఆయనకు డిసెంబర్ 24 మంగళవారం రోజున శివ రాజ్‌కుమార్ (Dr Shivaraj kumar)కి సర్జరీ జరిగిందని ప్రకటించారు. అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ.. శివన్న సర్జరీ విజయవంతం అయిందని ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నెల నుంచి రెండు నెలల విశ్రాంతి అనంతరం సాధారణ జీవితం గడపొచ్చని వెళ్లడించారు.
ఈ వార్తతో కన్నడ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. చాలామంది దేవాలయాలకు వెళ్లి మోక్కులు చెల్లించుకుంటున్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదిలాఉండగా శివరాజ్‌కుమార్ మరో నెల రోజులు యూఎస్‌లోనే ఉండనుండగా జనవరి 26 తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారు. మార్చి నుంచి తను అంగీకరించిన చిత్రాల షూటింగ్‌లలో పాల్గొననున్నారు. అందులో రామ్ చరణ్ (Ramcharan), బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న #RC16 సినిమా కూడా ఉంది.
Thank You #Geethakka 🙏🏼 You Stood with Anna ❤❤❤
Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍
Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar @NimmaShivanna ❤❤❤
— ⋆𝒜𝒷𝒽𝒾 ⋆ ᴮʰᵃᶦʳᵃᵗʰᶦ ᴿᵃⁿᵃᵍᵃˡ (@AbhishekRanagal) December 25, 2024
ಜಾತಿ ಧರ್ಮ ಮೀರಿ ಬೆಳೆದ ಬಂಗಾರದ ಮನುಷ್ಯ ❤️
ಗೆದ್ದು ಬಾರಯ್ಯ ನೀ ನಮ್ಮ ಮೃತ್ಯುಂಜಯ 💪#Shivanna ❤️ pic.twitter.com/GRhqHwcTen
— Nandhini J K (@NandhiniJK1) December 24, 2024