E. S. L Narasimhan | Ktr
విధాత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను చెన్నై లోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లు ఉన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నరసింహన్ దంపతులను శాలువతో సత్కరించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా బహుకరించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చైన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల అఖిల పక్ష సమావేశానికి వెళ్లిన కేసీఆర్ అదే పట్టణంలోని గవర్నర్ నరసింహన్ నివాసానికి వెళ్ళడం జరిగింది.