Black Mamba | చూడాల్సిన వీడియో : బ్లాక్‌ మాంబా నుంచి డేగను కాపాడిన సివంగి.. కానీ.. చివరకు!

బ్లాక్‌ మాంబాలు అత్యంత విషపూరితమైనవి. అంతేకాదు.. వేగంగా దాడి చేయగల సామర్థ్యం ఉన్నవి. ఎలుకలు, పక్షులు, చిన్న చిన్న జంతువులను మింగేస్తాయి. కానీ.. అదే సమయంలో అవి కూడా డేగలతోపాటు.. సింహాలు, పులుల వంటి క్రూర మృగాలకు ఆహారంగానే ఉంటాయి. అదే ఈ జీవ వైవిధ్యం. ఒకటి ఒకదానికి ఆహారం.. అది మరో దానిని ఆహారం! ఇదే అడవిలో జీవన లక్షణం.

Black Mamba | జంతు ప్రపంచంలో అద్భుతాలకు, అనూహ్య ఘటనలకు అంతే ఉండదు. ఒక్కోసారి శత్రుజీవులేవో మిత్రజీవులేవో కూడా అర్థం కాదు. సింహాలు అడవికి రారాజులుగా చెబుతారు. దేన్నైనా అది దాడి చేసి తినేయగల శక్తిమంతమైనవి. కానీ.. అప్పుడుప్పుడు అంతటి క్రూర జంతువు సైతం ఉదారతను ప్రదర్శిస్తుంటాయి. చనిపోయిన కోతికి అప్పుడే పుట్టిన చిన్న కోతిపిల్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న వీడియో అప్పుడప్పుడు నెట్టింట దర్శనమిస్తుంటుంది. ఆపదలో చిక్కుకున్న జంతువులను వేరొక జాతి జంతువులు కాపాడిన ఉదంతాలూ కనిస్తాయి. అదే తరహాలో ఒక వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నది.

సవన్నా అడవుల్లో తీసిన ఈ వీడియోలో ఒక బ్లాక్‌మాంబా ఒక డేగను పట్టుకుంటుంది. దాన్ని తినేందుకు సిద్ధమవుతున్న సమయంలో అటుగా ఒక ఆడ సింహం వస్తుంది. బ్లాక్‌ మాంబా చుట్టేసిన పక్షివైపు చూస్తుంది. అది ప్రమాదంలో ఉన్నట్టు అర్థం చేసుకుని, ఆ పాము నుంచి పక్షిని రక్షించేందుకు సివంగి చాలా జాగ్రత్తతో ప్రయత్నాలు చేస్తుంది. కొన్నిసార్లు బ్లాక్‌ మాంబా.. ఆ సివంగిపైనా దాడి చేయడానికి బుసలు కొడుతుంది. ఆ సమయంలో వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గిన సివంగి.. దానిని తినేందుకు దాడికి సిద్ధమవుతుంది. అదే సమయంలో మరో ఆడ సింహం అక్కడకు వస్తుంది. దీంతో ఎట్టకేలకు ఆ పాము డేగను వదిలేసి వెళ్లిపోతుంది. అక్కడే మరో ఆసక్తికర దృశ్యం కనిపిస్తుంది. సింహాలు కూడా పక్షులను తింటాయి. ఇదే క్రమంలో ఆ పక్షిని నోట పట్టేందుకు అవి పొంచి ఉన్నాయా? అనిపిస్తున్న సమయంలో ఆ డేగ.. రెండు రెక్కలు ఎత్తి.. కొద్ది క్షణాలు నిలబడి రెక్కలు విదుల్చుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోవడం కనిపిస్తుంది.

బ్లాక్‌ మాంబాలు అత్యంత విషపూరితమైనవి. అంతేకాదు.. వేగంగా దాడి చేయగల సామర్థ్యం ఉన్నవి. ఎలుకలు, పక్షులు, చిన్న చిన్న జంతువులను మింగేస్తాయి. కానీ.. అదే సమయంలో అవి కూడా డేగలతోపాటు.. సింహాలు, పులుల వంటి క్రూర మృగాలకు ఆహారంగానే ఉంటాయి. అదే ఈ జీవ వైవిధ్యం. ఒకటి ఒకదానికి ఆహారం.. అది మరో దానిని ఆహారం! ఇదే అడవిలో జీవన లక్షణం. మనుగడ కోసం పోరాటం.

ఇదిగో ఆ వీడియో..

ఇవి కూడా చదవండి..

King Cobra viral video | షాకింగ్ వీడియో: అది కింగ్​ కోబ్రా కాదు, నువ్వు మనిషివీ కాదు..వామ్మో..
Merge 14 Telangana Villages with Maharashtra | మహారాష్ట్రలో 14తెలంగాణ గ్రామాలు విలీనం
మద్యం మత్తులో స్కూల్ బస్​ డ్రైవర్లు – తల్లిదండ్రులూ తస్మాత్​ జాగ్రత్త.!

Latest News