విధాత: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli ) కాంబినేషన్ ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB29) సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమాలో మహేశ్‌కు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) , ప్రతి నాయకుడిగా మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)లను లాక్ చేశారు.
ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది. కొంతమంది ఉత్సాహవంతులు అప్పుడే రంగంలోకి దిగి ఏఐని ఉపయోగించి మహేశ్, ప్రియాంకలను కలిపి ఫొటోలను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. కాగా జనవరిలో మీడియా సమావేశం నిర్వహించి సినిమా వివరాలు తెలియజేస్తారని ఆపై కొద్ది రోజుల్లోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఏడాదిగా ఈ సినిమా విషయంలో విదేశీ నటులు చాలామంది ఈ చిత్రంలో నటిస్తున్నారని, ఫలానా వాళ్లు ప్రధాన పాత్రలు పోషిస్తారంటూ వార్తలు తెగ వైరల్ అయినప్పటికీ చివరికి ఫృధ్వీ, ప్రియాంక చోప్రలను ఫిక్స్ చేశారు. ఇతర నటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగాఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టులలో ఒకటిగా ఈ మూవీ ఇప్పటికే గుర్తింపును దక్కించుకోవడం విశేషం.
అంతేకాకుండా యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో భారతీయ సినిమా చరిత్రలోనే పాన్ వరల్డ్ మూవీగా సుమారు రూ. 900 నుంచి 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. పూర్తిగా ఆఫ్రికా ఆడవులు, ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.ఇందుకు సంబంధించి రాజమౌళి, కార్తికేయ పలువురు కెన్యా, ఇతర దేశాల్లోని ఫారెస్టులను సందర్శఙంచి, షూటింగ్ స్పాట్‌లను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇదిలాఉండగా ప్రియాంకాచోప్రా బాలీవుడ్ సినిఆలకు ఫుల్‌స్టాప్ పెట్టి హాలీవుడ్‌లో నాలుగైదు వరుస భారీ సినిమాలతో బిజీగా ఉంది. దీంతో ఇప్పటికే ప్రియాంకకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండడం కూడా ఈ రాజమౌళి సినిమాకు ఉపయోగపడనుంది. అయి గతంలో రామ్‌చరణ్ హీరోగా హిందీలో ఆరంగేట్రం చేస్తూ నటించిన జంజీర్ రిమేక్‌లో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించడం విశేషం. ఆ సినిమాను తెలుగులో తుఫాన్‌గా విడుదల చేశారు.