- జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కర్ణన్
- దాన కిశోర్‌కు లేబర్, ఎంప్లాయిమెంట్
- రెండు ముక్కలుగా మున్సిపల్ శాఖ
హైదరాబాద్, (విధాత): రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరున నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కీలక స్థానాలలో ఉన్న కొందరు అధికారులకు స్థానచలనం కలిగించి, ప్రాధాన్యం లేని బాధ్యతలు అప్పగించినట్టు కనిపిస్తున్నది. మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిశోర్‌ను లేబర్, ఎంప్లాయింట్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. తాను చెప్పిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా తాత్సారం చేయడం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిదంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉండటం కూడా బదిలీకి కారణం అయిందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా మున్సిపల్ వ్యవహారాల శాఖను రెండు ముక్కలు చేశారని ఈ బదిలీలను బట్టి అవగతమవుతున్నది. హెచ్ఎండీఏ పరిధి వరకు ఇలంబర్తిని, హెచ్ఎండీఏ పరిధి ఆవల టీకే శ్రీదేవిని నియమించారు. కానీ మున్సిపల్ వ్యవహారాల శాఖకు ముఖ్య కార్యదర్శిని నియమించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐటీ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్‌ను ఈ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగించారు. ఆయన ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడినప్పటికీ సాధించుకోలేకపోయారు. అయినప్పటికీ ఆయనకు ప్రాధాన్యత తగ్గించకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకున్నారని అంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పిన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఆ తరువాత పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూముల విషయంలో వివాదాస్పద ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు. ఈ రీ ట్వీట్‌పై గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పైగా రీ ట్వీట్‌ను సమర్థించడమే కాకుండా.. రెండు వేల మంది షేర్ చేశారు.. వాళ్ళపై ఏ చర్యలు తీసుకుంటారంటూ తన వాదనను సమర్థించుకుంటూ ట్వీట్ చేయడం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. దీంతో ఆమె పర్యాటక శాఖకు రాక ముందు పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా తిరిగి నియమించారు.
ఈ ఏడాది చివరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండటం, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలుపుకొని ముందుకు పోయేవారిని నియమించాలనే ఉద్దేశ్యంతో ఆర్వీ కర్ణన్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారని అంటున్నారు. ప్రస్తుత కమిషనర్ కే ఇలంబర్తికి అందరినీ కలుపుకొనిపోయే లక్షణాలు లేకపోవడంతో బదిలీ అయినట్లు తెలిసింది. ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీశ్‌కు బాధ్యతల్లో పదోన్నతి కల్పించారు. టీజీ జెన్కో సీఎండీగా నియమించి, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కల్పించారు.
అధికారి పేరు ప్రస్తుత స్థానం బదిలీ
శశాంక్ గోయల్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ డీజీ వీసీ సీజీజీ
జయేశ్ రంజన్ ఐటీఈ అండ్ సీ స్పెషల్ సీఎస్ ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సెల్ సీఎంవో, యూత్, టూరిజం అదనపు బాధ్యతలు
సంజయ్ కుమార్ ఎల్ఈటీ అండ్ ఎఫ్ స్పెషల్ సీఎస్ ఐటీఈ అండ్ సీ స్పెషల్ సీఎస్
దాన కిశోర్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్ఈటీ అండ్ ఎఫ్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి, ఇన్సూరెన్స్ అదనపు బాధ్యతలు
స్మితా సబర్వాల్ యూత్, టూరిజం ముఖ్య కార్యదర్శి టీజీ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ
టీకే శ్రీదేవీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (హెచ్ఎండీఏ అవతల)
కే ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ మెట్రోపాలిటన్ ఏరియా కార్యదర్శి (హెచ్ఎండిఏ పరిధి)
ఆర్వీ కర్ణన్ హెల్త్, ఫ్యామిలీ డైరెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్
కే శశాంక స్టేట్ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టు కమిషనర్ ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్, గనుల కమిషనర్ అదనపు బాధ్యతలు
ఎస్.హరీశ్ ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ టీజీ జెన్కో సీఎండీ, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ తో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జాయింట్ సెక్రెటరీ అదనపు బాధ్యతలు
ఎన్ నిఖిల టీ గ్రిడ్ సీఈవో టీజీ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ
ఎస్.సంగీత సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ సీఎంవో ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో అదనపు బాధ్యతలు
ఎస్.వెంకట్రావు ప్రొటోకాల్ జాయింట్ సెక్రటరీ ఎండోమెంట్ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో అదనపు బాధ్యతలు
టీ కాత్యాయని దేవీ టీజీ ఆర్థిక కమిషన్ జేఎండీ అడిషనల్ సీఈవో సెర్ఫ్
ఈవీ నరసింహా రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్ మెంట్ సెల్ సీఈఓ, మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి గా అదనపు బాధ్యతలు
హేమంత్ సహదేవ్ రావు టీజీఎంఎస్ఐడీసీ ఎం.డి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్
జీ ఫణీంద్రారెడ్డి హైదరాబాద్ సీఆర్వో టీజీఎంఎస్ఐడీసీ ఎం.డి
పీ కదిరవన్ అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ పంచాయత్ రాజ్ జాయింట్ కమిషనర్
కే విద్యాసాగర్ చీఫ్ సెక్రటరీ ఓఎస్‌డీ అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్, హైదరాబాద్ సీఆర్ఓ గా అదనపు బాధ్యతలు
ఆర్ ఉపేందర్ రెడ్డి జోనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ సెక్రటరీ