Site icon vidhaatha

Malla Reddy: జపాన్‌లో.. చిల్ అవుతున్న మేడ్చ‌ల్‌ మల్లన్న!

Malla Reddy |

విధాత : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు జపాన్ పర్యటనలో సందడి చేస్తున్నారు. పాలమ్మినా.. పూలమ్మినా.. కాలేజీలు పెట్టినా.. ఎంపీ.. ఎమ్మెల్యే.. మంత్రిని కూడా అయినా అంటూ తరుచు తన పంచ్ మార్క్ కామెడీ డైలాగ్ లతో ఇంటా బయటనే కాదు..అసెంబ్లీలోనూ అందరిని నవ్వుల్లో ముంచెత్తడం ఆయన ప్రత్యేకత. తరుచూ తన కళాశాల విద్యార్ధుల ఈవెంట్లతో పాటు సినిమా ఈవెంట్లలోనూ తన మాటలతోనే కాకుండా డాన్స్ తోను మల్లన్న పంచే కామెడీ అంతా ఇంత కాదు. మల్లన్న చూపే జోష్ చూస్తే ఆయనలో ఓ చిన్న పిల్లాడు..యువకుడు కనిపిస్తారంటారు.

జీవితంలో పాలమ్మి..పూలమ్మడంతో పాటు రియల్ ఎస్టేట్ చేసి ఎదిగి..ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో మల్లారెడ్డి తన సంపాదనను పతాక స్థాయికి చేర్చుకున్నాడు. జీవితంలో అన్ని కోరికలు నెరవేరినాయని చెప్పుకునే మల్లారెడ్డి ప్రతిపక్ష ప్రజాప్రతినిధిగా చేసేదేముందనుకున్నాడో ఏమోగాని విదేశీ పర్యటనకు వెళ్లారు.

సమ్మర్ ట్రిప్ కోసం జపాన్ వెళ్లిన మల్లారెడ్ది దంపతులు టోక్యో వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏమాటకు ఆ మాటేగాని బతికితే ఇలా నిత్యం నవ్వుతూ సంబరంగా సంతోషంగా మల్లన్న లెక్క బతికాలనిపిస్తుందంటున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో డబ్బులుంటే రోజు పండగే..జల్సాలే..నవ్వులే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version