విధాత: హఫీజ్ పేటలో తమ భూమిని హైడ్రా అన్యాయంగా స్వాధీనం చేసుకుందని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తమ భూముల్లో ఉన్న నిర్మాణాలను హైడ్రా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సెలవు దినాల్లో కూల్చేసింది..ఫెన్సింగ్ వేసుకుని స్వాధీనం చేసుకుందని వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా హైడ్రా ప్రవర్తించిందని తెలిపారు. అందుకు హైడ్రా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.