MLC Kavitha arrest | బస్ పాస్ చార్జీలను తగ్గించాలంటూ ఆందోళన చేపట్టిన ఎమ్మెల్సీ కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ పాస్ చార్జీలు తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో కలిసి ఆమె బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. బస్ భవన్ గేటు ముందు నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు పలువురు జాగృతి కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకొని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ తాజాగా బస్ పాస్ లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సాధారణ బస్ పాస్ లతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ లను కూడా పెంచింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ.. ఇతర పాస్ లు పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులు, చిరుద్యోగులు ప్రభుత్వ తీరు పట్ల మండిపడుతున్నారు. దీంతో కవిత వారికి మద్దతుగా ఆందోళన చేపట్టారు.
MLC Kavitha arrest | ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. – కంచన్ బాగ్ స్టేషన్ కు తరలింపు
