మోహన్‌లాల్ ప్రధాన కథానాయకుడిగా ఫృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్ 2 ఎంపురన్. టొవినో థామస్, సూరజ్ వింజరమూడు, మంజూ వారియర్, ఇంద్రజిత్ సుకుమారన్, ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 27న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తక్కువ సమయంలో అధిక వ్యూస్ దక్కించుకుని సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.