Viral | King Cobra
విధాత : కింగ్ కోబ్రా చూస్తేనే ప్రాణభయంతో పరుగులు తీస్తాం..దగ్గరగా వస్తే గుండెలు ఆగిపోతాయి..తాకితే చావు భయంతో గగుర్పాటుకు లోనవుతుంటారు. కాటేస్తే దాని విషానికి పైకి పోవాల్సిందే..అయితే పాములతో సహవాసం చేసే వారికి..పాములు పట్టేవారికి మాత్రం కింగ్ కోబ్రా అయినా..ఇంకేదైనా ఒక్కటే మరి. అయితే ఓ నెలల చిన్నోడు పడగ విప్పి బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాతో ఆటలాడిన తీరు.. ఆ కోబ్రా కూడా అతడేదో దాని దోస్తు అన్నట్లుగా వ్యవహరించిన వైనం చూసి తీరాల్సిందే మరి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#viral #viralvideo pic.twitter.com/9i8rZwQjbw
— srk (@srk9484) June 21, 2025
ఓ కింగ్ కోబ్రా ఓ నెలల బుడ్డోడి చేతిలో ఆటబొమ్మగా మారిపోయింది. పడగ విప్పి తన మీదకు వచ్చిన కింగ్ కోబ్రా పడగపై ఆ పిల్లాడు చేతులతో కొడుతూ..ఆడుకున్నాడు. దానిని చేతులతో పట్టేసి పక్కన పడేశాడు. అయినా ఆ కోబ్రా మళ్లీ అతని ఒడిలోకి వెళ్లి అతనితో ఆటలాడేందుకు ప్రయత్నించింది. ఆ పిల్లాడు మాత్రం దాని పడగపై కొడుతూ..పట్టుకుని పక్కన పడేస్తూ…రెండు చేతులు పైకెత్తి నేనే గెలిచానన్నట్లుగా కేరింతలు కొడుతున్న దృశ్యాలు చూసే వారు కళ్లు తిప్పుకోలేరు.
కింగ్ కోబ్రాతో పిల్లాడి ఆట చూస్తే పురాణాల్లో బాలకృష్ణుడు యమునా నదిలో కాళింగుడు అనే విషనాగుడి పీచమణిచి పడగపై నాట్యామాడిన దృశ్యాలు గుర్తుకురాకమానవు. అయితే ఈ వీడియోలో పిల్లాడితో ఆడిన కింగ్ కోబ్రా విషరహితంగా మార్చిన పెంపుడు పాము కావచ్చని..అందుకే పిల్లాడి వద్ధ వదిలి రీల్స్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా సర్పరాజం కింగ్ కోబ్రాతో పిల్లాడి సయ్యాటలు చూసి తీరాల్సిందేనంటున్నారు నెటిజన్లు.
#viral #viralvideo pic.twitter.com/9i8rZwQjbw
— srk (@srk9484) June 21, 2025