Site icon vidhaatha

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు పెంపు!

Kaleshwaram:

విధాత: జస్టిస్ పీసీ.ఘోష్ కాళేశ్వరం కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పెంచింది. ఈ నెలాఖరుతో గడువు ముగిసిపోతుండటం.. విచారణ తుది దశకు చేరిన నేపథ్యంలో మరోసారి కమిషన్ గడువు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పీసీ.ఘోష్ కమిషన్‌ విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు అధికారులు, నిపుణులను విచారించిన విషయం తెలిసిందే.

100రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని తొలుత 2024 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే విచారణ పూర్తికాని నేపథ్యంలో పలుమార్లు కమిషన్ గడువు పెంచుతూ వస్తున్న ప్రభుత్వం తాజాగా మే 31వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాళేశ్వం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ నివేదిక, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రభుత్వానికి అందడంతో కాళేశ్వం కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ 90శాతం పూర్తవ్వగా..తుది విచారణ ఘట్టంలో మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లను విచారణకు పిలువ వచ్చని భావిస్తున్నారు.

Exit mobile version