Site icon vidhaatha

Hcu | Ai ఫోటో రీట్వీట్.. IAS స్మితా సబర్వాల్‌కు నోటీసులు!

విధాత: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్, తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారంటూ స్మితా సబర్వాల్ పై ఫిర్యాదు నమోదైంది. దీంతో 179బీఎన్ఎస్ ప్రకారం పోలీసులు స్మితాసబర్వాల్ కు నోటీసులు ఇచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎంవో సెక్రటరీగా ఓ వెలుగు వెలిగిన స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంతకాలం అప్రాధాన్యత పోస్టుల్లో కొనసాగారు. ప్రస్తుతం తెలంగాణ టూరిజం సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచ అందాల సుందరి పోటీల నిర్వాహణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరవుతున్న క్రమంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఏఐ ఫోటో రీట్వీట్ కేసులో నోటీసులు జారీ కావడం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version