Kannappa
విధాత: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa)నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న స్టార్లు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, విష్ణు కూతుర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడంతో పాటు వారి పాత్రలకు సంబంధించిన పేర్లను, వారి చరిత్రను తెలియజేశారు.
తాజాగా ఈ సోమవారం సినిమా నుంచి కన్నప్ప ప్రియురాలుగా ప్రిన్సెస్ నెమలి పాత్రను పోషించిన ముద్దుగుమ్మ ప్రీతి ముకుంధన్ (Preity Mukhundhan) లుక్‌ను విడుదల చేశారు. అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పను సర్వస్వం, చెంచు యువరాణి నెమలి అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.