Preity Zinta Angry | ప్రముఖనటి, పంజాబ్ సూపర్ కింగ్స్ కో పార్ట్ నర్ ప్రీతీ జింటా (Preity Zinta) మీడియా, సోషల్ మీడియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఫొటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం నిర్ధారణ చేసుకోకుండా ఫొటోలను ఎలా పబ్లిష్ చేసిందంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ప్రీతీ జింటా హగ్ చేసుకున్నట్టు కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో మాత్రమే కాక.. కొన్ని ప్రముఖ మీడియా చానళ్లల్లోనూ టెలీకాస్ట్ అయ్యాయి. తాజాగా ఈ ఫొటోలపై ప్రీతీ స్పందించారు.
అవి ఫేక్ ఫొటోలని క్లారిటీ ఇచ్చారు. మే 17న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ప్రీతి జింటా, వైభవ్ సూర్యవంశీ తో మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కేవలం ప్రీతీ.. వైభవ్ ను అభినందిస్తున్నట్టు మాత్రమే ఉంది.
కానీ కొందరు ఏఐ సాయంతో ప్రీతీ.. వైభవ్ ను కౌగిలించుకుంటున్నట్టు ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. కొన్ని ప్రముఖ మీడియా చానళ్లు సైతం ఈ ఫొటోలను ప్రసారం చేశాయి. దీంతో తాజాగా ప్రీతీ స్పందించారు.
మీడియా సంస్థలు ఫొటోలను పోస్ట్ చేసేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలంటూ చురకలు అంటించారు.