Site icon vidhaatha

రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌తో రఘురామ భేటీ

విధాత:రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు.దాదాపు 10 నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు.ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.రాజ్‌నాథ్‌తో భేటీకి ఆయన వీల్‌ చెయిర్‌లోనే వెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగంపై ఏపీ సీఐడీ రఘురామపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిరోజులు ఆయనకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యమందించారు.అనంతరం సర్వోన్నత న్యాయస్థానం రఘురామకు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.విడుదల అనంతరం ఆయన నేరుగా దిల్లీ వెళ్లారు.

Exit mobile version