Site icon vidhaatha

రేవంత్ స‌ర్కార్‌కు షాక్‌: HCU.. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు స్టే

విధాత : హెచ్ సీయూ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత సహా అక్కడ జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని సుప్రీమ్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు అన్ని చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హెచ్ సీయూ భూముల్లో చెట్ల నరికివేతను జస్టిస్ గవాయ్ ధర్మాసనం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఉదయం జస్టిస్ గవాయ్ ధర్మాసనం హెచ్ సీయూ కంచ గచ్చి భూముల్లో చెట్ల నరికివేత వివాదంపై రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ను స్పాట్ కు వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3:30కల్లా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో యూనివర్సిటీకి వెళ్లి భూములను, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను కోర్టుకు అందచేశారు. ఈ నివేదికను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. వివాదంపై వార్త కథనాలను అమీకస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. దీనిపై రిట్ పిటిషన్ తయారు చేయాలని ధర్మాసనం అమీకస్ క్యూరీకి సూచించించారు.

కంచ గచ్చి భూముల్లో చెట్ల నరికివేత వివాదం చాలా సీరియస్ విషయమని.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరంగా చర్యలు ఎందుకు చేపట్టారని..ఫారెస్ట్, పర్యావరణ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని పేర్కొంది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని.. వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు సీఎస్ ను ప్రతివాదిగా చేర్చింది. ఈ వివాదంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని.. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంతకుముందు ఉదయం జస్టిస్ గవాయ్ ధర్మాసనం హెచ్ సీయూ కంచె గచ్చి భూముల్లో చెట్ల నరికివేత వివాదంపై రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ను స్పాట్ కు వెళ్లి పరిశీలించి మధ్యాహ్నం 3:30కల్లా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో యూనివర్సిటీకి వెళ్లి భూములను, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన రిజిస్ట్రార మధ్యంతర నివేదికను కోర్టుకు అందచేశారు. ఈ నివేదికను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. వివాదంపై అమీకస్ క్యూరీని రిట్ పిటిషన్ తయారు చేయాలని సూచించించారు.

ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కంచ గచ్చిబౌలిలో ఉన్నది అసలు అటవీ భూమే కాదు అని రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. అయితే అది అటవీ భూమి అవునా కాదా అనే విషయం తర్వాత.. అసలు చెట్లు నరికేయడానికి అనుమతి తీసుకున్నారా అని చురకలు వేసింది. ఒక వ్యక్తి ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా చట్టం కంటే గొప్ప కాదు అని పరోక్షంగా రేవంత్ రెడ్డికి ధర్మాసనం మొట్టికాయలు వేసింది. అక్కడ అడవిని నాశనం చేసే యాక్టివిటీ జరుగుతోందని..చెట్లు.. నెమళ్ళు.. పక్షులు.. వన్య ప్రాణులు ఉన్నాయన్నారు. అంత అత్యవసరంగా చెట్లు నరికేయాల్సిన అవసరం ఏమొచ్చిందని.. అసలు పర్యావరణ, అటవీ అనుమతి తీసుకున్నారా..పర్యావరణానికి జరిగే నష్టం గురించి అంచనా వేశారా.. వీటన్నింటికి సమాధానం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. ఇటు హైకోర్టు సైతం కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై జరిగిన విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version