Site icon vidhaatha

TTD ఈవో ఇంట్లో దూరిన పాము.. ప‌ట్టుకోబోయిన రిటైర్డ్ ఉద్యోగికి కాటు

విధాత: తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై పాము కాటు వేసింది.

దీంతో సిబ్బంది అతడిని హుటాహుటిన స్విమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉంది. తరచు తిరుమల కొండపై పాములు సంచారం కలకలం రేపుతోంది. విలాసవంతంగా ఉండే ఈవో ఇంట్లోనే పాము చొరబడిన నేపథ్యంలో ఇతర భక్తుల కాటేజీలలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Exit mobile version