BSF jawan | న్యూఢిల్లీ : భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పశువుల స్మగ్లర్లు బీఎస్ఎఫ్ జవాన్‌ను అపహరించారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే జవాన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..?
శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బెంగాల్‌లోని కుచ్ బెహార్ జిల్లాలో .. కొంతమంది పశువుల స్మగ్లర్లు భారత భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు.. స్మగ్లర్లను తరుముతూ ముందుకు వెళ్లారు. అయితే జవాన్లలో ఒకరైన బెడ్ ప్రకాశ్ అనే జవాన్.. బంగ్లాదేశ్ సరిహద్దులోకి ప్రవేశించారు. మంచు దట్టంగా ఉండడంతో తోటి జవాన్ల నుంచి ప్రకాశ్ తప్పిపోయారు. సరిహద్దు దాటి బంగ్లాదేశ్ భూభాగంలోకి సదరు జవాను ప్రవేశించారు. దీన్ని అదునుగా చేసుకున్న స్మగ్లర్లు.. జవాన్‌ను అపహరించారు.
జవాన్ బెడ్ ప్రకాశ్‌ను స్మగ్లర్లు అపహరించి.. బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ సిబ్బందికి అప్పగించారు. 174వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్‌ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జవాన్ సురక్షితంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ బలగాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి :
Revanth Reddy| సభకు రా..చర్చిద్దాం : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Pregnant Murder | కులాంతర వివాహం.. గర్భిణిని కొట్టి చంపిన తండ్రి
